కోల్బెల్ట్/నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసీపేట-1ఏ బొగ్గు గనిలో ఏర్పాటుచేసిన మ్యాన్రైడింగ్సిస్టంను శుక్రవారం సింగరేణి డైరెక్టర్(ప్లానింగ్ అండ్ప్రాజెక్ట్) కె.వెంకటేశ్వర్లు ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణతో కలిసి ప్రారంభించారు. గనిలోకి కాలినడకన వెళ్లే ఉద్యోగుల ఇబ్బందులు తొలగించేందుకు రూ.4.26 కోట్లతో 1350 మీటర్ల పొడవైన మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్టింగ్సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డైరెక్టర్ తెలిపారు.
అనంతరం కేకే ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు, మట్టి వెలికితీత పనులను పర్యవేక్షించారు. రామకృష్ణాపూర్సింగరేణి రెస్క్యూ స్టేషన్ వద్ద నిర్మాణంలో ఉన్న పేలుడు పదార్థాలకు సంబంధించిన సర్ఫేస్ మిక్డ్స్ఎమల్షన్ ప్లాంట్ పనులను తనిఖీ చేసి పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో రూ.12లక్షలతో నిర్మించిన వాకింగ్ట్రాక్ను తన సతీమణి కె.విజయలక్ష్మి, జీఎం శ్రీవాణితో కలిసి డైరెక్టర్ ప్రారంభించారు.
శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ ఓసీలోని క్వారీ, పని ప్రదేశాలు పరిశీలించారు. జీఎం కార్యాలయంలో రివ్యూ నిర్వహించి ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యసాధనే ధ్యేయంగా సమిష్టిగా కృషిచేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రం, ఏస్వోటుజీఎం జీఎల్ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ రమణారావు తదితరులు పాల్గొన్నారు.

