సింగరేణి కార్మికుల ఖాతాల్లోకి ..అక్టోబర్ 18న దీపావళి బోనస్

సింగరేణి కార్మికుల ఖాతాల్లోకి ..అక్టోబర్ 18న  దీపావళి బోనస్
  • రూ.1.03 లక్షలు చెల్లిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్ల దీపావళి బోనస్ ప్రకటించింది. పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పీఎల్ఆర్) స్కీం కింద బోనస్ చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 

డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు శనివారం(ఈ నెల18న) కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ వెల్లడించారు. ఈ దీపావళి బోనస్ అండర్​గ్రౌండ్​లో 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనుల్లో, సర్ఫేస్ లో 240 మస్టర్లు పూర్తి చేసిన వారికి రూ 1.03 లక్షల పూర్తి బోనస్ అందుతుందని తెలిపారు. 

అంతకంటే తక్కువ పనిదినాలు పని చేసిన వారికి నిష్పత్తి ప్రకారం బోనస్ ను చెల్లిస్తామని వెల్లడించారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 30 మస్టర్లు పూర్తి చేసిన వారు ఈ బోనస్ పొందడానికి అర్హులని సింగరేణి యాజమాన్యం జారీ చేసిన సర్క్యూలర్ లో వెల్లడించింది.