1,818 మంది లైఫ్ ​సర్టిఫికెట్లు ఇచ్చి పెన్షన్ పొందాలి...సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సూచన

1,818 మంది లైఫ్ ​సర్టిఫికెట్లు ఇచ్చి  పెన్షన్ పొందాలి...సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సూచన
కోల్​బెల్ట్, వెలుగు: లైఫ్​సర్టిఫికెట్లు ఇవ్వని 1,818 మంది సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఆగిపోయిందని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్​సెక్రటరీ అళవందార్ వేణుమాధవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎంపీఎఫ్​ఆఫీసర్లు సంబంధితా పెన్షన్​దారులు లైఫ్​సర్టిఫికెట్లు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్–-1998 కింద ప్రావిడెంట్ ఫండ్ ను గతేడాది మార్చి నుంచి రూ.1,000 చెల్లిస్తుంది. లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వని1,818 మంది పెన్షన్ దారులు వెంటనే ఆన్ లైన్ లో జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సీఎంపీఎఫ్ అధికారులకు సమర్పించి పెన్షన్ పొందాలని ఆయన సూచించారు.