వేరే రాష్ట్రాల్లో సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు

వేరే రాష్ట్రాల్లో సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు
  • అధికారులు అధ్యయనం చేయాలని సీఎండీ బలరామ్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: దేశంలోని పలు రాష్ట్రాల్లో సోలార్​పవర్​ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సింగరేణి కాలరీస్​సంస్థ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్, గుజరాత్, కర్నాటక తదితర రాష్ట్రాల్లో సోలార్​ప్లాంట్ల ఏర్పాట్లపై అధికారులు అధ్యయనం చేయాలని సింగరేణి సీఎండీ బలరామ్ సూచించారు. ఇతర సంస్థలతో కలిసి జాయింట్​వెంచర్​ప్రాజెక్టులు చేపట్టడానికి ఉన్న అవకాశాలపై ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక ఇవ్వాలని సీఎండీ బలరామ్ అధికారులను ఆదేశించారు. శనివారం థర్మల్, సోలార్​పవర్​ప్లాంట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు.

జైపూర్​పవర్​ప్లాంట్​ఆవరణలో 800 మెగావాట్ల సూపర్​క్రిటికల్​థర్మల్​ప్లాంట్​టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అక్కడే రూ.700 కోట్లతో చేపట్టిన ఫ్లూ గ్యాస్​డీ సల్ఫరైజేషన్​ప్లాంట్​పనుల పురోగతిని ఆరా తీశారు. సమావేశంలో ఉన్నతాధికారులు సత్యనారాయణ, జేఎన్​సింగ్, జానకీరామ్​, సూర్యనారాయణ, విశ్వనాథ రాజు, సుధాకర్, కొండారెడ్డి, ప్రసాద్​తదితరులు పాల్గొన్నారు.