సింగరేణి జీడీకే 1వ గనిలో కార్మికుల ధర్నా

సింగరేణి జీడీకే 1వ గనిలో కార్మికుల ధర్నా

గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్​పరిధిలోని జీడీకే 1వ గనిలో సోమవారం కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ మహిళా కార్మికురాలు తన తోటి మహిళా కార్మికురాళ్లను, కార్మికులను అవమానించేలా వ్యవహరించిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ మేరకు ఉదయం హాజరు వేశాక మైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎవరూ వెళ్లకుండా పనులు బంద్​ చేశారు. 

అనంతరం జీఎం లలిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి కార్మికులు చర్చించారు. సదరు మహిళా కార్మికురాలిపై చర్యలు తీసుకుంటూ జీడీకే 1వ గని నుంచి సీహెచ్​పీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో కార్మికులు ఆందోళనను విరమించారు.