
గాయకుడు సాయిచంద్ భార్యకు నామినేటెడ్ పదవి.. కోటిన్నర ఆర్థిక సాయం
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా సాయిచంద్ భార్య
హైదరాబాద్ : తెలంగాణ గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా ఉద్యమ గాయకుడు సాయిచంద్ సతీమణి శ్రీవేద రజనిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్‌పర్సన్, గాయకుడు సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆ కుటుంబానికి సాంత్వన చేకూర్చడంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. శ్రీవేద రజనిని గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నియమిస్తామని శుక్రవారం (జులై 7న) రాష్ర్ట ఐటీశాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రకటించారు.
ALSO READ :కాంగ్రెస్ లో కమిటీల లొల్లి.. రెండు సార్లు ఆర్డర్లిస్తున్న పీసీసీ
సాయిచంద్ కుటుంబానికి రూ. కోటిన్నర ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం నుంచి సమకూరుస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. సాయిచంద్ దంపతులకు కుమారుడు చరీష్ (చెర్రీస్), కుమార్తె నది ఉన్నారు.