ఇండిగో పై సింగర్ బిస్మిల్ అసహనం వ్యక్తం చేశారు. ఇండిగో సిబ్బంది.. ప్రయాణికుల లగేజ్ హ్యాండిల్ చేసే విధానంపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండిగో ఉద్యోగి తన ఖరీదైన సంగీత వాయిద్యాలను విసిరేస్తున్న వీడియోను బిస్మిల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. వీడియోలో ఇండిగో గ్రౌండ్ వర్కర్లు ప్రయాణికులు లగేజ్ బ్యాగులను విసిరివేస్తున్నట్లు కనిపిస్తుంది. లగేజ్ పట్ల వర్కర్లు వ్యవహరిస్తున్న తీరు ప్రయాణికులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఎయిర్ లైన్ ఉద్యోగులు నిర్వర్తించే విధానం వల్ల సంగీత వాయిద్యాలు కలత చెందుతాయని బిస్మిల్ అన్నారు. ఇండిగో సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఇండిగో సిబ్బంది తన లగేజీ పట్ల దురుసుగా వ్యవహరించారని సింగర్ బిస్మిల్ విమర్శించారు. మీరు మా సంగీత వాయిద్యాలను గౌరవించాలని అని బిస్మిల్ ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు పెట్టారు. తమ అదనపు సామాను కోసం 30వేలు అదనంగా చెల్లించామని అతడు చెప్పాడు. తన తోటి కళాకారులు.. తమ బ్యాకులను ఇండిగో సిబ్బందికి ఇచ్చినప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని సింగర్ బిస్మిల్ సూచించాడు.

