సిరాజ్‌‌‌‌‌‌‌‌ సిక్సర్‌‌‌‌‌‌‌‌..తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 6 వికెట్లు తీసిన హైదరాబాదీ

సిరాజ్‌‌‌‌‌‌‌‌ సిక్సర్‌‌‌‌‌‌‌‌..తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 6 వికెట్లు తీసిన హైదరాబాదీ
  •      సౌతాఫ్రికా 55కే ఆలౌట్‌‌‌‌‌‌‌‌
  •      ఇండియా 153 ఆలౌట్​
  •     రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికా 62/3

కేప్‌‌‌‌‌‌‌‌ టౌన్‌ ‌‌‌‌‌‌‌: ఇండియా, సౌతాఫ్రికా రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌ (6/15) కెరీర్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ గణాంకాలతో చెలరేగిన వేళ..  బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచిన ప్రొటీస్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 23.2 ఓవర్లలో 55 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. కైల్‌‌‌‌‌‌‌‌ వెరియానె (15) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. తర్వాత  కోహ్లీ (46), రోహిత్‌‌‌‌‌‌‌‌ (39), గిల్‌‌‌‌‌‌‌‌ (36) రాణించడంతో.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 34.5 ఓవర్లలో 153 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. దీంతో ఇండియాకు 98 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన సౌతాఫ్రికా ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు 17 ఓవర్లలో 62/3 స్కోరు చేసింది. మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (36 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), బెడింగ్‌‌‌‌‌‌‌‌హమ్‌‌‌‌‌‌‌‌ (7 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌)  క్రీజులో ఉన్నారు. ఎల్గర్‌‌‌‌‌‌‌‌ (12), జోర్జి (1), స్టబ్స్‌‌‌‌‌‌‌‌ (1) నిరాశపర్చారు. ప్రస్తుతం సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ ఇంకా 36 రన్స్‌‌‌‌‌‌‌‌ వెనకబడి ఉంది. 

ఆరుగురు డకౌట్లు

రెండో సెషన్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఆరుగురు డకౌట్స్ కాగా రోహిత్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ మాత్రమే ఫర్వాలేదనిపించారు. 3వ ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే యశస్వి (0) ఔట్‌‌‌‌‌‌‌‌కాగా, రోహిత్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌ ఆచితూచి ఆడారు. రెండు వైపుల నుంచి సఫారీ పేసర్లు పదునైన ఇన్‌‌‌‌‌‌‌‌, ఔట్‌‌‌‌‌‌‌‌ స్వింగర్లతో ఎదురుదాడి చేసినా ఈ ఇద్దరు డిఫెన్స్‌‌‌‌‌‌‌‌తో వికెట్లను కాపాడుకున్నారు. కానీ బర్గర్‌‌‌‌‌‌‌‌ (3/42) రాకతో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ బాగా తడబడింది. 15వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన అతను రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 55 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

ఈ దశలో కోహ్లీ నిలకడగా ఆడినా.. 21వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో గిల్‌‌‌‌‌‌‌‌ను వెనక్కి పంపి బర్గర్‌‌‌‌‌‌‌‌ మళ్లీ షాకిచ్చాడు. అప్పటికి ఇండియా స్కోరు 105/3. ఇక్కడి నుంచి సఫారీ బౌలర్లు రబాడ (3/38), ఎంగిడి (3/30), బర్గర్‌‌‌‌‌‌‌‌ మరింత పట్టు బిగించారు. దీంతో రాహుల్‌‌‌‌‌‌‌‌ (8) మినహా..  శ్రేయస్‌‌‌‌‌‌‌‌ (0), జడేజా (0), బుమ్రా (0), సిరాజ్‌‌‌‌‌‌‌‌ (0), ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ (0), ముకేశ్‌‌‌‌‌‌‌‌ (0 నాటౌట్‌‌‌‌‌‌‌‌) డకౌటయ్యారు. రాహుల్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 43 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేయడంతో స్కోరు150 దాటింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఇండియా 48 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. ఇందులో ఒక్క రన్​ కూడా చేయకుండానే చివరి 6 వికెట్లు చేజార్చుకుంది. 

బౌలింగ్‌‌‌‌‌‌‌‌ అదుర్స్‌‌‌‌‌‌‌‌.. 

ఆరంభంలో తేమతో కూడిన పిచ్‌‌‌‌‌‌‌‌పై సిరాజ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌క్లాస్‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌, స్వింగ్‌‌‌‌‌‌‌‌, సీమ్‌‌‌‌‌‌‌‌ మూవ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో చెలరేగిపోయాడు. ఫుల్లర్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ (4-–6 మీటర్లు)తో ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా బౌన్స్‌‌‌‌‌‌‌‌ రాబడుతూ వరుసగా 9 ఓవర్లు వేసి ఆరు వికెట్లు తీసి సఫారీలను ఘోరంగా దెబ్బకొట్టాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో బుమ్రా (2/25) కూడా తన స్టైల్‌‌‌‌‌‌‌‌లో బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. షార్ట్‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌, లెగ్‌‌‌‌‌‌‌‌ స్లిప్‌‌‌‌‌‌‌‌లో ఫీల్డర్లను మోహరించి కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ కౌంటర్‌‌‌‌‌‌‌‌ అటాక్‌‌‌‌‌‌‌‌ ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఫలితంగా 4వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ స్వింగర్‌‌‌‌‌‌‌‌ను డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ చేయబోయిన మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (2) థర్డ్‌‌‌‌‌‌‌‌ స్లిప్‌‌‌‌‌‌‌‌లో యశస్వికి క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 

6వ  ఓవర్‌‌‌‌‌‌‌‌లో క్రాస్‌‌‌‌‌‌‌‌ యాంగిల్‌‌‌‌‌‌‌‌తో వేసిన ఫుల్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను ఎల్గర్‌‌‌‌‌‌‌‌ (4) వికెట్లపైకి ఆడుకున్నాడు. 9వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో బుమ్రా షార్ట్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ను ఆడిన స్టబ్స్‌‌‌‌‌‌‌‌ (3).. షార్ట్‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 10వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌ నడుం ఎత్తులో వేసిన బాల్‌‌‌‌‌‌‌‌ను లెగ్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌ ఫ్లిక్‌‌‌‌‌‌‌‌ చేయబోయి జోర్జి (2).. కీపర్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ చేతికి చిక్కాడు. 16వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 3 బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో బెడింగ్‌‌‌‌‌‌‌‌హమ్‌‌‌‌‌‌‌‌ (12), జెన్సెన్‌‌‌‌‌‌‌‌ (0)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపి ఐదు వికెట్ల హాల్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. 

34/6తో కష్టాల్లో పడిన సౌతాఫ్రికాను వెరియానె ఆదుకునే ప్రయత్నం చేశాడు. 18వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌ స్వింగ్‌‌‌‌‌‌‌‌కు వెరియానె.. గిల్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌ దక్కింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో ముకేశ్‌‌‌‌‌‌‌‌ (2/0)కు బాల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి రోహిత్‌‌‌‌‌‌‌‌ మరో ప్రయోగం చేశాడు. కేవలం 14 బాల్స్‌‌‌‌‌‌‌‌లో సింగిల్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌ కూడా ఇవ్వకుండా కేశవ్‌‌‌‌‌‌‌‌ మహరాజ్‌‌‌‌‌‌‌‌ (3), రబాడ (5)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. మధ్యలో బుమ్రా.. నాండ్రీ బర్గర్‌‌‌‌‌‌‌‌ (4) వికెట్‌‌‌‌‌‌‌‌ తీయడంతో సౌతాఫ్రికా అత్యల్ప స్కోరుకు పరిమితమైంది. 

1 ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లోకి తిరిగి అడుగుపెట్టిన తర్వాత (1991) టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు (55).
2 92 ఏళ్ల ఇండియా టెస్ట్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ చరిత్రలో లంచ్‌‌‌‌‌‌‌‌లోపే ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌‌‌‌‌‌‌‌గా సిరాజ్‌‌‌‌‌‌‌‌ రికార్డు సృష్టించాడు. 1986-87లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ మణిందర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ఈ ఫీట్‌‌‌‌‌‌‌‌ సాధించాడు.

సంక్షిప్త స్కోర్లు

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 23.2 ఓవర్లలో 55 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (వెరియానె 15, బెడింగ్‌‌‌‌‌‌‌‌హమ్‌‌‌‌‌‌‌‌ 12, సిరాజ్‌‌‌‌‌‌‌‌ 6/15, బుమ్రా 2/25, ముకేశ్‌‌‌‌‌‌‌‌ 2/0). ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 34.5 ఓవర్లలో 153 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (కోహ్లీ 46, రోహిత్‌‌‌‌‌‌‌‌ 39, గిల్‌‌‌‌‌‌‌‌ 36, రబాడ 3/38, ఎంగిడి 3/30, బర్గర్‌‌‌‌‌‌‌‌ 3/42). సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 17 ఓవర్లలో 62/3 (మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ 36*, బెడింగ్‌‌‌‌‌‌‌‌హమ్‌‌‌‌‌‌‌‌ 7*, ముకేశ్‌‌‌‌‌‌‌‌ 2/25).