
భైంసా, వెలుగు: భారీ వర్షాల కారణంగా నిర్మల్‌జిల్లా భైంసా మండలంలోని సిరాల ప్రాజెక్టు తెగింది. గురువారం వర్షానికి ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టుపై నుంచి నీరు పారింది. ప్రాజెక్టు మూడు చోట్ల గండిపడడంతో సిరాల, ఇలేగాం, దేగాం, వాలేగాం, కామోల్వరకు 800 ఎకరాల భూములు మునిగాయి. 300 ఎకరాల్లో పూర్తిగా బండరాళ్లు, ఇసుకమేటలు వేశాయి. 23 ట్రాన్స్ ఫార్మర్లు, 106 కరెంట్‌స్తంభాలు విరిగిపడ్డాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రాజెక్టు కింద నిర్మించిన 4 కిలోమీటర్ల కెనాల్ కొట్టుకుపోయింది.
సిరాల ప్రాజెక్టు, ఇలేగాం చెరువు తెగిపోవడంతో బడ్గాం శివారుల్లోని రైస్‌మిల్లులో పనిచేసే ఏడుగురు నీళ్లలో చిక్కుకుపోయారు. భైంసా ఏఎస్పీ కాంతిలాల్పాటిల్రెస్క్యూటీంతో కలిసి వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. వరద ఉధృతికి 12 బర్రెలు కొట్టుకుపోగా ఒక బర్రె చనిపోయింది. దీంతో శుక్రవారం కలెక్టర్వరుణ్రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, అడిషనల్కలెక్టర్, ఇరిగేషన్ ఆఫీసర్లు సిరాల చేరుకుని పరిస్థితి సమీక్షించారు. బాధితులతో మాట్లాడారు. నష్టం వివరాలు సేకరించి నష్టపరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తెలిపారు.