తమ్ముడే బినామీ!..రోహిత్ రెడ్డి వ్యాపారాలకు రితేశ్ రెడ్డి బినామీ: సిట్ ప్రాథమిక అంచనా

తమ్ముడే బినామీ!..రోహిత్ రెడ్డి వ్యాపారాలకు రితేశ్ రెడ్డి బినామీ: సిట్ ప్రాథమిక అంచనా
  •     ఇద్దరి ఆర్థిక లావాదేవీలపై ఆరా
  •     ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో విచారణకు సహకరిస్తలేరని వెల్లడి
  •     మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సిట్ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     కస్టడీ, బెయిల్ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై రేపు విచారణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణ కొనసాగుతున్నది. అయితే, రోహిత్ రెడ్డి వ్యాపారాలకు అతని సోదరుడు రితేశ్ రెడ్డి బినామీగా ఉన్నట్టు సిట్​ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ మేరకు రోహిత్​ రెడ్డి, రితేశ్​కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది.​ ప్రధానంగా ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరఫరాతో పాటు కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టి సారించింది. అయితే, కాల్పులు జరిపిన నమిత్ శర్మ పూర్తి వివరాలతో పాటు గన్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి నిందితులు వెల్లడించడం లేదని తెలిసింది. ఇప్పటి వరకు ఆరుసార్లు విచారించినప్పటికీ ఆశించిన స్థాయిలో వివరాలు రాబట్టలేక పోయారని తెలిసింది. 

దీంతో ముగ్గురు నిందితులను మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్యలు చేపట్టింది.  డ్రగ్స్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న మరికొంత మంది పెడ్లర్లు, వారికి చెల్లించిన పేమెంట్లు సహా నిందితుల ఆర్థికలావాదేవీలను రాబట్టేందుకు మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో శనివారం కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ఇప్పటికే ఈ ముగ్గురిని రెండుసార్లు కస్టడీకి తీసుకుని ఆరురోజుల పాటు ప్రశ్నించిన సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. శనివారం ఉదయంతో సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కస్టడీ ముగియడంతో చంచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు తరలించింది.

20 రోజులుగా జైల్లోనే రోహిత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రోహిత్ రెడ్డి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గత నెల 14న వీకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఈగల్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దాడులు జరిపిన సమయంలో కాల్పులు జరిపినందుకు గాను రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, రితేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, నమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మలను హత్యాయత్నం కింద రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. వీరిని ఇప్పటికే రెండు సార్లు కస్టడీకి తీసుకుని విచారించారు. 

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ్యవహారంలో వీరి ఆర్థిక లావాదేవీల వివరాలను రాబట్టాల్సిన అవసరం ఉన్నందున మరో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ ముగ్గురు నిందితులు గత నెల 16 నుంచి జ్యుడీషియల్ రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండడం.. ఆరురోజుల కస్టడీ కూడా ముగిసినందున బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మంజూరు చేయాలని కోరుతూ నిందితుల తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి.