
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు నందకుమార్కు చెందిన డెక్కన్ హోటల్ సహా నివాసంలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితులు డెక్కన్ హోటల్లో బస చేసినట్లుగా సిట్ గుర్తించింది. దీనికి సంబంధించి ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు.
మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితుల బెయిల్పై తీర్పును ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ బీ ఫాంతో గెలిచారని..ఆయనకు ఫిర్యాదు చేయడానికి అర్హత లేదని వాదించారు. ఈ కేసు చెల్లదని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ కోరగా.. న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.