
- విచారణకు సహకరించడం లేదని పిటిషన్
- ఢిల్లీకి డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడంలేదని, ఆయనను అరెస్టు నుంచి మినహాయించవద్దని కోరుతూ పిటిషన్ దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమైంది. ఈ మేరకు డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. వచ్చే నెల 4న ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై సుప్రీంలో విచారణ జరగనుంది.
అప్పటి వరకు అరెస్టు చేయకుండా ఉండేందుకు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు నుంచి మినహాయింపు పొందారు. విచారణకు సహకరించాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. అయితే అమెరికా నుంచి వచ్చిన ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవుతున్నా.. కీలక ప్రశ్నలకు జవాబును దాటవేస్తుండటంతో సిట్ కస్టడీ విచారణ తప్పదని భావిస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
►ALSO READ | సంతకాలు ఫోర్జరీతోనే... హెచ్‌సీఏ అధ్యక్షుడైన జగన్మోహన్ రావు..! ఐపీఎల్ టికెట్ల తీగ లాగితే కదిలిన డొంక