నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం కేసులో దర్యాప్తు కోసం సిట్‌‌ ఏర్పాటు

నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం కేసులో దర్యాప్తు కోసం సిట్‌‌ ఏర్పాటు

సీపీ సీవీ ఆనంద్‌‌ నేతృత్వంలో దర్యాప్తు

హైదరాబాద్‌‌, వెలుగు: నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం కేసులో దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌‌(సిట్‌‌)ను ఏర్పాటు చేసింది. దీనికి హైదరాబాద్‌‌ పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్‌‌ నేతృత్వం వహించనున్నారు. బుధవారం ఆర్డర్​ కాపీని ప్రభుత్వం విడుదల చేసింది. సిట్​లో నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్‌‌ క్రైమ్స్‌‌ డీసీపీ కల్మేశ్వర్‌‌, శంషాబాద్‌‌ డీసీపీ జగదీశ్వర్‌‌రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌‌ ఏసీపీ గంగాధర్‌‌, మొయినాబాద్‌‌ ఎస్‌‌హెచ్‌‌వో లక్ష్మీరెడ్డి ఉన్నారు. మొయినాబాద్​లోని ఎమ్మెల్యే పైలెట్‌‌ రోహిత్‌‌ రెడ్డి ఫామ్‌‌హౌస్‌‌ నుంచి సిట్‌‌ దర్యాప్తు ప్రారంభించనుంది. ఇప్పటికే సేకరించిన ఆడియో, వీడియో, కాల్‌‌డేటా ఆధారంగా విచారణ జరుపనుంది.