వై.సతీశ్​రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డిపై సిట్ చర్యలు తీసుకోవాలి: రాంచందర్ రావు

వై.సతీశ్​రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డిపై సిట్ చర్యలు తీసుకోవాలి: రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: ప్రజా జీవితంలో ఉన్నవారికి లుక్ ఔట్ నోటీస్ ఇవ్వడం ఏంటని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మండిపడ్డారు. లుక్ ఔట్ నోటీసులు ఇచ్చినట్లు టీఆర్ఎస్ నేత వై.సతీశ్ రెడ్డి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టారని అన్నారు. క్షమాపణలు చెప్పకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు.

మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దర్యాప్తు ఎలా సాగుతోంది.. లీకులు ఎలా ఇస్తున్నారు.. సిట్ అధికారులు దీన్ని ఖండించాలి. మీడియాకు తప్పుడు వార్తలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి” అని ఆయన డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. సతీష్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డిపై సిట్ చర్యలు తీసుకోవాలని అన్నారు. లుక్ ఔట్ నోటీసులు ఎవరికి ఇవ్వాలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ ఉన్నాయన్నారు.