
సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకుంటోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పలు వీడియోలతో ఆకట్టుకున్న ఆమె.. తాజాగా తన క్లాసికల్ డ్యాన్స్ తో అదరగొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సితార డ్యాన్స్ చూసిన నెటిజన్లు ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
సితార క్లాసికల్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసిన మహేశ్ బాబు.. సితార నువ్వు ఎప్పుడూ నన్ను గర్వపడేలాగే చేస్తావు.. దీన్ని ఇలాగే కొనసాగించు అంటూ ఆయన రాసుకొచ్చారు. సితారకు ఇంత అద్భుతంగా డ్యాన్స్ నేర్పించిన మహతి భిక్షు, అరుణ భిక్షుకి ఈ సందర్భంగా థ్యాంక్స్ అన్న మహేశ్.. అందరికీ దివాళీ విషెస్ చెప్పారు.