హంగ్ వస్తే కాంగ్రెస్​కే సపోర్ట్: సీతారాం ఏచూరి​

హంగ్ వస్తే కాంగ్రెస్​కే సపోర్ట్: సీతారాం ఏచూరి​

హైదరాబాద్: తెలంగాణలో హంగ్ వస్తే కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు ఉంటుందని ఆపార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సీబీఐ.. బీజేపీ చేతిలో బందీ అయ్యాయని ఆరోపించారు. బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘మీట్​ది మీడియా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘దొడ్డిదారిలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం బీజేపీ చరిత్ర. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేక స్టాండ్‌తోనే ఉన్నం. యాంటి బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నరు. రాష్ట్రంలో హంగ్ వస్తే కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు ఉంటుంది. ఇండియా కూటమిలో ఇప్పటికే ఉన్నం. ప్రజలతో సీపీఎంకు ఉన్న సంబంధాలను నిలబెట్టుకునేందుకే  ఇక్కడ పోటీ చేస్తున్నం. ఏ పార్టీ అయినా.. తాము గెలిచేందుకే బరిలో ఉంటుంది. ఇతరుల విజయం కోసం కాదు’ అని ఏచూరి తెలిపారు.