ఈ నెల 9 నుంచి అమెజాన్ లో ‘సీతారామం’ స్ట్రీమింగ్

ఈ నెల 9 నుంచి అమెజాన్ లో ‘సీతారామం’ స్ట్రీమింగ్

మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ జంటగా రూపొందిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5 విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. రిలీజైన రోజునుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏకంగా రూ. 80 కోట్లకు పైగానే వసూళ్ళు సాధించింది. బాలీవుడ్ లోనూ విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.

అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కాబోతోంది. భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ వారు కైవసం చేసుకున్నట్టు సమాచారం. మరి ఈ సినిమా ఓటీటీలో ఏ స్థాయిలో ఆదరణ దక్కించుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ‘సీతారామం’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఇక ఈ మూవీలో లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ నటించగా.. సీతగా, నూర్జహాన్ గా మృణాళ్ సహజన నటనను కనబరిచింది. దర్శకుడు హను రాఘవపూడి కథ, స్క్రీన్ ప్లేతో పాటు విజువల్స్, ఎమోషన్స్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేశాయి. ఇందులో రష్మిక మందాన, సుమంత్ కీలక రోల్స్ చేశారు. స్వప్నా సినిమాస్, వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై సి. అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు.