- 26న ఎదుర్కోలు, 28న పట్టాభిషేకం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్ట అనుబంధమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉదయం గణపతిపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, రామ మానస పూజతో వసంత నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
గురువారం మొదలైన నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం, 27న తిరుకల్యాణం, 28న మధ్యాహ్నం శ్రీరామ పట్టాభిషేకం, సాయంత్రం డోలోత్సవం నిర్వహించనున్నారు. అలాగే 29న సత్యనారాయణ స్వామి వ్రతం, 30న నిత్య పూజాదులు, కంకణ విమోచనంతో వసంత నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి
