
మెదక్, వెలుగు: మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్అభ్యర్థిగా సిట్టింగ్ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముచ్చటగా మూడో సారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన ఆమె ఇపుడు మూడో సారి పోటీ చేస్తున్నారు. ఆగస్టు నెలలోనే సీఎం కేసీఆర్ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ బీఫాం అందుకున్నారు.
ఐదోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ..
నారాయణ్ ఖేడ్: నియోజకవర్గం నుంచి ఐదోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ రాజీవ్ గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భూపాల్ రెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాడన్నారు. కార్యక్రమంలో రోషన్ రెడ్డి, రవీందర్ నాయక్, నజీబ్, పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పల్లాకు బీఫాం
చేర్యాల: జనగామ అసెంబ్లీ బీఆర్ఎస్అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫాం అందుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు కడవేర్గు, నాగపురి గ్రామాల్లో కార్యకర్తలు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాగేశ్వర్రావు, స్వరూపరాణి, రాజీవ్‌రెడ్డి, బాలనర్సయ్య, మల్లేశం గౌడ్, వెంకట్‌రెడ్డి, చంటి, నరేందర్, సతీశ్ గౌడ్, కనకమ్మ, అంజయ్య, తిరుపతి గౌడ్, యాదగిరి, చందు, రాజు పాల్గొన్నారు.