టెర్రరిస్టులకు పాక్ అండ .. ఆ దేశ సహకారంతోనే జమ్మూకాశ్మీర్ లో చొరబాట్లు : మనోజ్ పాండే

టెర్రరిస్టులకు పాక్ అండ ..  ఆ దేశ సహకారంతోనే జమ్మూకాశ్మీర్  లో చొరబాట్లు : మనోజ్ పాండే

న్యూఢిల్లీ:  జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు తగ్గినప్పటికీ, రాజౌరీ–పూంచ్ సెక్టార్ లో మాత్రం టెన్షన్స్ పెరిగాయని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. టెర్రరిస్టులకు పాకిస్తాన్ సాయం చేస్తోందని, ఆ దేశం క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. పాక్ అండతోనే టెర్రరిస్టులు చొరబాట్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పాక్ బార్డర్ లో చొరబాటు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నామన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో ఆర్మీ చీఫ్ మాట్లాడారు. కొన్ని రోజులుగా రాజౌరీ–పూంచ్ సెక్టార్ లో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆయన తెలిపారు.

 ‘‘రాజౌరీ–పూంచ్ సెక్టార్ లో 2003లో టెర్రరిజం లేకుండా చేశాం. అప్పటి నుంచి 2017–18 వరకు అక్కడ శాంతి నెలకొంది. కానీ ఆ తర్వాత మళ్లీ టెర్రరిస్టుల కార్యకలాపాలు మొదలయ్యాయి. గత ఆరు నెలల్లో అవి ఎక్కువయ్యాయి” అని చెప్పారు. ఈ సెక్టార్ లో మళ్లీ శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ‘‘గత మూడేండ్లలో 45 మందిని టెర్రరిస్టులను మట్టుబెట్టాం. గతేడాది ఐదుసార్లు చొరబాట్లను అడ్డుకున్నాం. ఆ టైమ్ లో ఆరుగురు టెర్రరిస్టులు హతమయ్యారు” అని పేర్కొన్నారు. కాగా, చైనా బార్డర్ వెంబడి తూర్పు లడఖ్ లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నప్పటికీ, అక్కడ సెన్సిటివ్ సిచ్యువేషన్ నెలకొందని ఆర్మీ చీఫ్ అన్నారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బార్డర్ లో రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిప్లమాటిక్, మిలటరీ లెవల్ లో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

మన దేశంలోకి 400 మంది మయన్మార్ సైనికులు ప్రవేశించారు.. 

గత రెండు నెలల్లో 400 మంది మయన్మార్ సైనికులు బార్డర్ గుండా మన దేశంలోకి ప్రవేశించారని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. ‘‘మయన్మార్ లో రెబెల్ గ్రూప్స్, ఆ దేశ ఆర్మీకి మధ్య ఫైరింగ్ జరుగుతోంది. ఆర్మీ పోస్టులను రెబెల్ గ్రూప్స్ స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది మయన్మార్ సైనికులు మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్లను తిరిగి పంపిస్తున్నాం” అని పేర్కొన్నారు.

ఆ దెబ్బతో.. చైనాకు మన పవరెంతో తెల్సింది: రాజ్​నాథ్​ సింగ్

లండన్: జమ్మూకాశ్మీర్​లోని గల్వాన్​లో తలపడిన తర్వాత ఇండియా బలహీనంగా లేదని చైనాకు అర్థమైందని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ అన్నారు. మూడ్రోజుల ఇంగ్లండ్​ పర్యటనలో ఉన్న రాజ్​నాథ్​ సింగ్ గురువారం లండన్​లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మూడేండ్ల కింద గల్వాన్​లో జరిగిన ఫేస్​ టు ఫేస్ ఫైట్ తర్వాతే చైనాకు మన పవరేందో తెలిసి వచ్చిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియా వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మారిందని, అందుకు ఆ దేశం అనుసరిస్తున్న ఆర్థిక, విదేశీ విధానాలే కారణమంటూ చైనా అధికారిక పత్రిక్యి అయిన గ్లోబల్ టైమ్స్ పత్రిక ఇటీవల ఓ ఆర్టికల్​ ప్రచురించింది. దీనిని ప్రస్తావిస్తూ రాజ్​నాథ్ సింగ్.. పై కామెంట్లు చేశారు. ఇప్పటికైనా మన దేశం పట్ల చైనా దృక్పథంలో మార్పు వచ్చిందని అన్నారు. రష్యాతో యుద్ధం సమయంలో ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన ఇండియన్ స్టూడెంట్లను తరలించడంలో ప్రధాని మోదీ చేసిన కృషిని కూడా ఈ సందర్భంగా రక్షణ మంత్రి ప్రస్తావించారు. .