Madharaasi: ‘మదరాసి’కి క్రేజీ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కావాలంటే, బిగ్గెస్ట్ హిట్ కొట్టాల్సిందే!

Madharaasi: ‘మదరాసి’కి క్రేజీ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కావాలంటే, బిగ్గెస్ట్ హిట్ కొట్టాల్సిందే!

‘అమరన్’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శివకార్తికేయన్ సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. అంతేకాదు..ఈ సినిమాతో శివకార్తికేయన్కు ప్రత్యేకమైన లేడీ ఫాలోవర్లు సైతం పెరిగారు. ఈ క్రమంలోనే మంచి మార్కెట్ కూడా సంపాదించుకున్నారు. మరోసారి శివకార్తికేయన్ తనదైన కంటెంట్ బేసెడ్ ఫిల్మ్తో వస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగాయి.

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘మదరాసి’ తో పలకరించనున్నారు శివకార్తికేయన్. ఈ తమిళ సైకలాజికల్ యాక్షన్ ఫిల్మ్ సెప్టెంబర్ 5న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ‘మదరాసి’ టికెట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగులో ఇప్పుడిప్పుడే బుకింగ్స్ ఊపందుకున్నాయి. రానున్న ఈ రెండ్రోజుల్లో థియేటర్స్ ఫుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 

‘మదరాసి’ బడ్జెట్ & టార్గెట్:

‘మదరాసి’ మూవీని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌‌‌పై ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మించారు. దర్శకుడు మురుగదాస్కు దాదాపు ఏడేళ్లుగా సరైన హిట్ లేకపోయినా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ హెచ్చించింది. అయినప్పటికీ.. ఈ సినిమాపై ముందు నుంచి పాజిటివ్ బజ్ వస్తోంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. తన చివరి మూడు సినిమాలతో ట్రాక్ తప్పిన మురుగదాస్.. తనకు కలిసొచ్చిన యాక్షన్ థ్రిల్లర్తో మళ్ళీ తన రూట్ లోకి వచ్చేశాడు. ఇదే సినిమాని నిలబెడుతుంది ట్రేడ్ వర్గాలతో పాటు మేకర్స్ నమ్ముతున్నారు.

ఇలా ముందస్తు అంచనాలకు తగ్గట్టుగానే మదరాసి ప్రీ రిలీజ్ బిజినెస్ లోను సత్తా చాటిందని సమాచారం. ఈ క్రమంలో డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ భారీ ధరకు అమ్మడుపోయినప్పటికీ.. అమౌంట్ ఎంతనే వివరాలు మాత్రమే బయటకి రాలేదు. అయితే, దాదాపు రూ.200 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల అంచనా! 

శివకార్తీకేయన్‌ గత సినిమా అమరన్‌ వసూళ్ల విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద అమరన్‌ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇండియా వైడ్‌గా రూ. 220 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.342 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి నిర్మాతలకు భారీ లాభాలను అందించింది. ఈ క్రమంలో మదరాసి మూవీకి స్టోరీ వర్కౌట్ అయి, మౌత్ టాక్ బాగుంటే ఈ రూ.220 కోట్ల నెట్ బ్రేక్ చేయడం పెద్ద విషయం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

‘మదరాసి’సెన్సార్:

‘మదరాసి’ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గంటల 47 నిమిషాల భారీ రన్‌టైమ్తో మూవీ రానుంది. తమిళనాడులో నార్త్ ఇండియా మాఫియా, రెండు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ మధ్య జరిగే కథ ఇదని టాక్.

ఇందులో శివకార్తీకేయన్ రఘు అనే పాత్రలో నటిస్తున్నాడు. మాఫియాను ఎదురించే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కథలో లవ్, పగ, ప్రతీకారం, త్యాగం, ఫ్రెండ్‌షిప్, రెండు గ్రూపుల మధ్య వార్ లాంటి అంశాలు హైలెట్‌ అని సెన్సార్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే.. శ్రీ లక్ష్మి మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో శివకార్తికేయన్ కి జోడిగా రుక్మిణి వసంత్ నటించింది. విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్, విక్రాంత్ మరియు షబీర్ కల్లరక్కల్ ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీకి, సుదీప్ ఎలామోన్ సినిమాటోగ్రఫీ, ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు.