ఇండో ఇన్ ఫ్రా సీడీడీ శివకృష్ణకు .. బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు

ఇండో ఇన్ ఫ్రా సీడీడీ శివకృష్ణకు ..  బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు

ఇండో ఇన్ ఫ్రా డెవలపర్స్ సీడీడీ డాక్టర్ పాలెం శివకృష్ణ గౌడ్​కు జాతీయ స్థాయిలో బెస్ట్ ఇన్నోవేటివ్ సేల్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. సేవా రంగం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి ఫలితాలను సాధించినందుకు గానూ ముంబయికి చెందిన సేల్స్ ఎల్ అండ్ డీ విజన్ అండ్ ఇన్నోవేషన్ సంస్థ ఆయనకు ఈ అవార్డును అందజేసింది. 

ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో శివకృష్ణ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రస్తుతం తమ సంస్థ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

 - వెలుగు, ఎల్ బీనగర్