
హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. రెండు రోజుల క్రితం చార్మినార్ ,మైలార్ దేవ్ పల్లి ప్రమాదాలు జరిగాయి. ఇలా రోజు ఏదో ఒక చోట నగరంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా రంగారెడ్డి జిల్లాలో మరో ప్రమాదం జరిగింది.
షాద్ నగర్ పట్టణంలోని నేషనల్ హైవే పక్కన ఉన్న ధన గ్యారేజ్ లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి 6 కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. మే 20న తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ధన గ్యారేజ్ లో నిలిపి ఉన్న ఓ ఇండికా కారు బ్యాటరీ పేలింది. పక్కనే ఉన్న వాహనాలకు ఈ మంటలు అంటుకోవడంతో ఆరు వాహనాలు కాలిపోయాయి. ఒక 18 మోడల్ షిఫ్ట్ డిజైర్ ,ఆల్టో, జీతో గూడ్స్ వెహికల్, ఇండికా, రెండు హుండాయ్ ఎక్సెంట్ కార్లు మంటలకు ధ్వంసం అయ్యాయి.
స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వాళ్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. అయితే అప్పటికే ఆరు వాహనాలు దగ్ధం అయ్యాయి. దాదాపు 15 నుంచి 20 లక్షల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.