రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల కోసం ఆరుగురితో కమిటీ

రాష్ట్రవ్యాప్తంగా  ప్రభుత్వ  స్కూళ్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల కోసం ఆరుగురితో కమిటీ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలోని 9,937 ప్రభుత్వ స్కూళ్లలో సోలార్​ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. వాటి  పర్యవేక్షణ కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. 

విద్యుత్​ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ చైర్మన్​గా.. రెడ్కో వైస్​ చైర్మన్​, ఎండీ కన్వీనర్​గా... ఫైనాన్స్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ, ఎస్​పీడీసీఎల్​ చైర్మన్​, స్కూల్​ ఎడ్యుకేషన్​ ప్రాజెక్ట్​ డైరెక్టర్​లను సభ్యులుగా నియమిస్తూ శుక్రవారం విద్యుత్​ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్​ ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రభుత్వం నిర్ధేశించిన ప్రభుత్వ స్కూళ్లలో రూ. 289.25 కోట్లతో చేపట్టబోయే సోలార్​ విద్యుత్​ కనెక్షన్లకు సంబంధించిన సోలార్ పవర్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల డిజైన్, సరఫరా, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలేషన్, కమీషనింగ్ పనులను ఈ కమిటీ నిర్వహిస్తుంది.