- కస్టమర్ల సిలిండర్లలో నుంచి కొద్దిగా తీసి చిన్న సిలిండర్లలోనింపి విక్రయం
- ఆరుగురి ముఠా అరెస్ట్
గోషామహల్, వెలుగు: వినియోగదారులకు అందజేసే గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్‌ను తీసి చిన్న సిలిండర్లలోకి నింపి అమ్ముకుంటున్న ఓ ముఠాను గోషామహల్ పోలీసు లు పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గోషామహల్ ఎస్‌హెచ్‌ఓ శ్రవణ్ కుమార్ తెలిపారు. గోషామహల్ కు చెందిన ఓ వ్యక్తి తాను బుక్ చేసుకున్న ఇండేన్గ్యాస్సిలిండర్ బరువు 30.4 కిలోలకు బదులు 28 కిలోలు ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరపగా, స్థానిక గ్యాస్ డెలివరీ బాయ్ అల్లె సాయి కుమార్ కొందరి సాయంతో సిలిం డర్ల నుంచి గ్యాస్ తీసి వినియోగ దారులను మోసం చేస్తున్నాడని తేలింది.
ఇతడికి దల్మోవా వినీత్‌కుమార్, మకాడియా అమీత్ కుమార్ అనే వ్యాపారులతో పాటు ఆటో డ్రైవర్ప్రవీణ్కుమార్, గ్యాస్‌డెలివరీ హెల్పర్పూస గణేశ్సహ కరించారని తేలింది. నిందితుల నుంచి రెండు కమర్షియల్సిలిండ ర్లు, 7 డొమెస్టిక్ సిలిండర్లు, 12 చిన్న సిలిండర్లతో పాటు గ్యాస్ రీఫిల్లింగ్ చేయడానికి ఉపయోగించే కిట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చేసే పని ప్రమాదకరమై నదని, చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉండేదన్నారు.
