యాపిల్ ఐపాడ్ కోసం అమ్మ అకౌంట్ నుంచి రూ.11లక్షలు కాజేసిన ఆరేళ్ల కొడుకు

యాపిల్ ఐపాడ్ కోసం అమ్మ అకౌంట్ నుంచి రూ.11లక్షలు కాజేసిన ఆరేళ్ల కొడుకు

యాపిల్ ఐపోన్ యూజ్ చేస్తున్న అమ్మకి తన ఆరేళ్ల కొడుకు షాకిచ్చాడు. యాపిల్ ఐపాడ్ కోసం అకౌంట్ లో ఉన్న రూ.11 లక్షల్ని కాజేశాడు. దీంతో కంగుతిన్న బాధితురాలు యాపిల్ సంస్థను ఆశ్రయించింది.

అమెరికా న్యూయార్క్ కు చెందిన యాపిల్ ఐఫోన్ యూజర్ జెస్సీకా జాన్సన్ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోగా అందులో సుమారు రూ.11లక్షలు మాయమైనట్లు గుర్తించింది. మాయమైన డబ్బుతో యాపిల్ కు చెందిన ఐపాడ్ కొనుగోలు చేసినట్లు గుర్తించింది. కానీ ఆ డబ్బుల్ని కాజేసింది జెస్సీకా ఆరేళ్ల కొడుడు జార్జ్ జాన్సన్ అని కనిపెట్టలేకపోయింది.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆధారంగా..జులై 8 న బాధితురాలు తన అకౌంట్ నుంచి 25 సార్లు ట్రాన్సాక్షన్ జరిగినట్లు, ఆ ట్రాన్సాక్షన్ల సమయంలో సుమారు రూ.1.85లక్షలు మాయమయ్యాయి. దీంతో హ్యాకర్స్ తన అకౌంట్ నుంచి డబ్బు మాయం చేశారంటూ సైబర్ క్రైమ్ పోలీసుల్ని అధికారుల్ని ఆశ్రయించింది.

విచారణ చేపట్టిన అధికారులు బాధితురాల్ని అకౌంట్లను చెక్ చేయగా..అకౌంట్ నుంచి తెలిసిన వ్యక్తులే ఆ డబ్బును మాయం చేసి ఉంటారని  అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో యాపిల్ ఐపాడ్ వినియోగిస్తున్న బాధితురాలి కొడుకు జార్జ్ జాన్సన్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.  ఐపాడ్ గురించి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లి జెస్సికా క్రెడిట్ ను ఉపయోగించి ఐపాడ్ తో పాటు ప్రీమియర్ గేమ్స్ ను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.

కాగా ఆరేళ్ల కొడుకు జార్జ్ తీరుతో కన్నీటి పర్యంతరమైన బాధితురాలు తన డబ్బును తిరిగి ఇచ్చేయాలని యాపిల్ సంస్థకు లేఖ రాసింది. ఆ లేఖ పై సంస్థ ప్రతినిధులు 60రోజుల లోపు క్యాష్ ను రిటర్న్ చేస్తామని, కానీ ఇప్పటికే సమయం మించి పోవడంతో డబ్బుల్ని తిరిగి ఇచ్చేది లేదంటూ రిప్లయి ఇచ్చారు.

దీంతో బాధితురాలు యాపిల్ సంస్థతో పాటు, పేపాల్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛార్జీల పేరుతో ఆ రెండు కంపెనీలు కష్టమర్లను మోసం చేస్తున్నాయంటూ ఆరోపణలు చేశారు.