చిన్నారిని చంపి రక్తం తాగిన మేనత్త

చిన్నారిని చంపి రక్తం తాగిన మేనత్త

తమ్ముని కూతురిని చంపి రక్తం తాగింది ఓ మేనత్త. ఈ ఘటన విశాఖ మన్యంలోని లకేయుపుట్టులో జరిగింది. వసంతాల రస్మో అనే మహిళ గత సంవత్సరం నుండి భర్తకు దూరంగా తమ్ముని ఇంట్లో ఉంటుంది. దీంతో పలుమార్లు తమ్ముని కుటుంబ సభ్యులు రస్మోను అత్తగారింటికి వెళ్లాల్సిందిగా కోరారు. ఈ విషయం పై కొట్లాటలూ జరిగాయి. తనను ఇంట్లోంచి వెళ్లగొట్టాలని చూస్తే తమ్ముని కూతురైన ఆరేళ్ల కొర్ర అనితను చంపేస్తానని రస్మో బెదిరించింది.

నాలుగురోజుల క్రితం రస్మోను ఇంట్లోంచి వెళ్లిపొమ్మంది తమ్ముని భార్య.. మంగళవారం కట్టెల కోసమని పక్కనే ఉన్న అడవికి.. అనితను తీసుకుని రస్మో వెళ్లి… కట్టెలను కొట్టే గొడ్డలితో పాప తలపై బలంగా కొట్టింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ఫ్రాణాలు విడిచింది. ఆ తర్వాత పాప రక్తాన్ని రస్మో తాగిందని స్థానికులు తెలిపారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.