డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ఫిలిమ్స్ ఫెస్టివల్

 డిసెంబర్ 19  నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్  షార్ట్ఫిలిమ్స్ ఫెస్టివల్
  • 705 షార్ట్​ఫిలిమ్స్​లో 60 ఎంపిక 
  • హాజరుకానున్న  నాజర్, నగేశ్ కుకునూరు
  • అంకురం దర్శకుడు ఉమా మహేశ్వర రావు వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం స్కూల్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించనున్నామని అంకురం చిత్ర దర్శకుడు ఉమా మహేశ్వర రావు తెలిపారు. బుధవారం సోమజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల19 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఈ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 705 షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయని, వాటిలో 60 షార్ట్ ఫిల్మ్స్‌ను సెలెక్ట్ చేశామని చెప్పారు.

 ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో స్క్రీనింగ్ జరుగుతుందన్నారు. నాజర్, నగేశ్ కుకునూరు, వివిధ రాష్ట్రాలకు చెందిన జ్యూరీ సభ్యులు హాజరవుతున్నారని తెలిపారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ప్రపంచ వేదికగా ఎదిగిందని, యూరప్, అమెరికా వంటి దేశాల నుంచి సినిమాలు వచ్చాయని తెలిపారు. మూడు రోజులు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించి వదిలేయడం కాకుండా, సినిమాలు పంపిన, చూసిన యువతతో అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మహంకాళి మధు పాల్గొన్నారు.