జూబ్లీహిల్స్, వెలుగు: అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్ నిర్వహిస్తున్న యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ లో గురువారం రాత్రి సాధారణ పెట్రోలింగ్‌లో భాగంగా ఇన్సోమ్నియా పబ్ వద్ద పెద్ద జనం గుమికూడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పబ్‌లోకి వెళ్లి చూడగా పదుల సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు. సమయ పాలన పాటించకపోవడంతో పబ్ మేనేజర్ షఫీ, యజమాని కునాల్‌పై కేసు నమోదు చేశారు.
