
ఎల్బీనగర్, వెలుగు: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంగళవారం ఆరో బంగారు బోనం సమర్పించారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో హరిబౌలి అక్కన్న మాదన్న అమ్మవారికి పూజలు నిర్వహించారు. నంతరం కళాకారుల నృత్యాల నడుమ జోగిని అవిక అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టువస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు.