చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్ మూడో సీజన్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ సూపర్5 రేసు నుంచి వైదొలిగింది. సోమవారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో హైదరాబాద్ 6-15, 11-15, 12‑1-5తో బెంగళూరు టార్పెడోస్ చేతిలో ఓడిపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడిన బ్లాక్‌హాక్స్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టనుంది. ఈ విజయంతో బెంగళూరు సూపర్5 ఆశలను సజీవంగా నిలుపుకుంది.
