జపాన్ ప్రభుత్వం ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌

జపాన్ ప్రభుత్వం ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌
  • ఏటా 120 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశం -మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం రుద్రారంలోని తోషిబా కంపెనీలో జపాన్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫాక్చర్ సంస్థ ఆధ్వర్యంలో ఐ టీ ఐ విద్యార్థులకు స్కిల్ డెవలప్ ట్రైనింగ్ కార్యక్రమాన్నిమంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి ప్రారంభించారు. ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బి. బి. పాటిల్, ఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, జపాన్ ప్రభుత్వ ప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జపాన్ ప్రభుత్వం శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి లభించబోతోందన్నారు. పరిశ్రమల అవసరలకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వబోతున్నామని, కేంద్ర, రాష్ట ప్రభుత్వలు టెక్నాలజీకి అనుగుణం గా  స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామని వివరించారు. ప్రతి ఏటా 120 మంది శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇవ్వబోతున్నరని, శిక్షణలో సంగారెడ్డి జిల్లా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కోరారు. సంగారెడ్డి, పటాన్ చెరు ప్రాంతంలోని ఐటీఐ విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఐటీఐ విద్యార్థులకు జపాన్ ఇండియా ఫర్ మాన్యుఫాక్చర్ సంస్థ ట్రైనింగ్ ఇవ్వడం సంతోషకరమన్నారు. తోషిబా కంపెనీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని..సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ఐటీఐ కాలేజ్ ను దత్తత తీసుకొని స్థానిక యువతకు ఉద్యోగలు ఇవ్వాలని కోరారు. విద్యార్థులు కష్టపడితే జీవితం లో సక్సెస్ అవుతారని సూచించారు. ఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. జపాన్ ప్రభుత్వం ద్వారా ఇచ్చే శిక్షణ పూర్తిగా ప్రాక్టికల్ గా ఉంటాయన్నారు. ట్రైనింగ్ లో ఐటీఐ విద్యార్థులు కొత్త టెక్నాలజీ నేర్చుకోబోతున్నారని.. ఈ శిక్షణ ద్వారా ఐటీఐ విద్యార్థులు ఉపాధి అవకాశాలు అందిపుచుకోవాలని సూచించారు.