కేరళను నైరుతి రుతుపవనాలు తాకినా.. నాలుగు వారాల పాటు దాని ప్రభావం ఇండియాలో తక్కువే ఉంటుందని స్కైమెట్ వెదర్ అనే సంస్థ వెల్లడించింది. తద్వారా వ్యవసాయ రంగంపై ఆధారపడే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలిపింది. ఎక్స్టెండెడ్ రేంజ్ ప్రిడిక్షన్ సిస్టం ప్రకారం.. జూలై 6 వరకు వర్షాలు పడే సూచన అంతగా లేదు. వర్షాధార పంటలు వేసే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.
రుతుపవనాలతో రావాల్సిన వర్షాలు ఆలస్యం అవుతున్నాయని, దీంతో వ్యవసాయదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు స్కైమెట్ తెలిపింది. దేశంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాల్లోని రైతులు వర్షాభావ పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో వానలు సరిగ్గా పడవని అంచనా వేసింది.
బిపర్జోయ్ తుఫాన్ప్రభావం..
సాధారణంగా జూన్1 న రావాల్సిన నైరుతి రుతుపవనాలు జూన్ 8న కేరళను తాకాయి. అదే సమయంలో గుజరాత్ తీరంలో ఏర్పడిన బిపర్జోయ్తుపాన్వల్ల రుతుపవనాలు ఆలస్యంగా రావడమే కాకుండా చురుగ్గా కదలక, మందగమనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘట్, జార్ఖండ్, బిహార్రాష్ట్రాలను జూన్ 15 వరకు కూడా నైరుతి చేరుకోవడం కష్టమేనంటోంది స్కైమెట్. కొంగొత్త ఆశలు రేపుతున్న ఈ వర్షాకాలం రైతులను కనికరిస్తుందో లేదో చూడాలి.
