ఇక్కడ శశి థరూర్ ను చూసి.. కొంతమందికి నిద్రలేని రాత్రులు ఖాయం.. ప్రధాని మోడీ

ఇక్కడ శశి థరూర్ ను చూసి..  కొంతమందికి నిద్రలేని రాత్రులు ఖాయం.. ప్రధాని మోడీ

కేరళలో విజిన్జమ్ సీపోర్ట్ ప్రారంభించారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియా కూటమిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మోడీ. ఈరోజు ఇక్కడ శశి థరూర్ ఉండటం కొంతమందికి నిద్రలేని రాత్రులు మిగుల్చుతుందని అన్నారు. శశిథరూర్ గురించి మోడీ ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.. అంతేకాకుండా శశిథరూర్ బీజేపీలో చేరనున్నారని చాలాకాలంగా టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

శశిథరూర్ తిరువనంతపురం విమానాశ్రయంలో ప్రధాని మోడీని స్వాగతించటం కూడా అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఈ సందర్భంగా థరూర్, ప్రధానిని స్వాగతిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యాయి.

 

ఇదిలా ఉండగా.. విజిన్జమ్ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఇండియాలోనే అత్యంత పరతిస్తాత్మకమైన ఇన్ఫ్రా స్ట్రక్చర్ కలిగిన సీపోర్ట్. రూ. 8 వేల 900 కోట్లతో నిర్మించిన ఈ సీపోర్ట్ అదానీ పోర్ట్స్ అండ్ SEZ లిమిటెడ్ ఆధ్వర్యంలో PPP విధానంలో రూపొందింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్య రంగంలో కీలకంగా మారనుంది ఈ పోర్ట్.