షెడ్యూల్ టైం కంటే ముందుగానే మోడీ రాక

షెడ్యూల్ టైం కంటే ముందుగానే మోడీ రాక

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నరకు రావాల్సి ఉంది. అయితే నలభై నిమిషాల ముందుగానే అంటే 12 గంటల 50 నిమిషాలకే బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని చేరుకోనున్నారు. అక్కడ 15 నిమిషాల పాటు పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ లోనే బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. ఆ తర్వాత హెలికాప్టర్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెలిపాడ్ కు చేరుకుంటారు. 

మధ్యాహ్నం గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20 వ వార్షికోత్సవానికి హాజరుకానున్నారు ప్రధాని. గంటా 15 నిమిషాల పాటు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. గోల్డ్ మెడల్ సాధించిన 8 మంది విద్యార్థులకు మెడల్స్, పట్టాలు అందజేస్తారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు హెలికాప్టర్ లో బయల్దేరి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో చెన్నైకి వెళ్లనున్నారు మోడీ.

బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధానిమోడీకి స్వాగతం పలకనున్నారు గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 4 చోట్ల మోడీకి ఘనస్వాగతం పలకనున్నారు బీజేపీ నేతలు. బేగంపేట ఎయిర్ పోర్టులో బీజేపీ స్టేట్ చీఫ్ బండిసంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు స్వాగతం పలకనున్నారు. మోడీకి పౌర సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు నేతలు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో బేగంపేట్ కు వచ్చారు. జాతీయ పతాకాలతో మోడీకి వెల్కమ్ చెప్పనున్నారు. 

ప్రధాని మోడీ రాక సందర్భంగా హైదరాబాద్ సిటీలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రానికి రావాల్సిన హామీలను ఈ ఫ్లెక్సీల్లో గుర్తు చేస్తూ ఐటీ కారిడార్ సహా పలు ప్రాంతాల్లో పెక్సీలు ఏర్పాటు చేశారు.  మెడికల్ కాలేజ్ ఎందుకు శాంక్షన్ చేయలేదని, డిఫెన్స్ కారిడార్ ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ప్రకటించలేదని ఇలాంటి ప్రశ్నలతో 17  చోట్ల ఇలాంటి  ఫ్లెక్సీలు వెలిశాయి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని మరో ఫ్లెక్సీ, పసుపు బోర్డు, ఐటీఐఆర్, ఫార్మాసిటీకి ఆర్థిక సహాయం ఎందుకు అందించట్లేదని ఇలాంటి వాటిపై ప్రశ్నలను ఫ్లెక్సీల్లో సంధించారు. 

 

మరిన్ని వార్తల కోసం

మోడీజీ..కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ ఏమైంది?

రూ.12లక్షలు పెట్టి మరీ కుక్కలా మారాడు