జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్: కడప విద్యార్ధిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్: కడప విద్యార్ధిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇటీవల జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్  పరీక్షల్లో కొందరు విద్యార్థలు స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. ఎలక్ట్రానిక్  డివైజ్ ను ఎగ్జామ్ సెంటర్ లోకి తీసుకెళ్లి కాపీ కొట్టారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చింతపల్లి చైతన్య కృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాను రాసిన జవాబులను ఓ విద్యార్థి వాట్సాప్ ద్వారా తన మిత్రులకు పంపాడు చైతన్య. ఎల్‌బీనగర్‌, మల్లాపూర్‌, మౌలాలి కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న మిగతా ముగ్గురు విద్యార్థులూ ఆ సమాధానాలను కాపీ చేశారు.

ఈ క్రమంలోనే.. ఒక కేంద్రంలో ఇన్విజిలేటర్‌ దీనిని గమనించి ఆ విద్యార్థిని పట్టుకున్నారు.  చైతన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. చైతన్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.