V6 News

మన రాష్ట్రంలో సంఘటనలపై కూడా స్పందించండి: రఘునందన్ రావు

మన రాష్ట్రంలో సంఘటనలపై కూడా స్పందించండి: రఘునందన్ రావు

హైదరాబాద్, వెలుగు:  సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్విట్టర్​లో కౌంటర్​ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సంఘటనలపై సత్వరమే స్పందిస్తూ ట్వీట్లు పెట్టే మీరు.. మన రాష్ట్రంలో జరిగే సంఘటనలపై కూడా అదే మాదిరిగా స్పందించాలని ట్వీట్ చేశారు. కాగా,  ఇటీవల జరిగిన మణిపూర్ ఘటన ఖండిస్తూ ఆమె ట్వీట్ చేశారు.  అదేవిధంగా నల్గొండ జిల్లాలో దళిత మహిళపై ఓ సర్పంచ్ రక్తం వచ్చేలా దాడి చేశారు. దీనిపై కూడా మీరు స్పందించాలని రఘునందన్​ కోరారు.