V6 News

సిడ్నీ టెస్టు: తొలి రోజు ఆసీస్‌దే

సిడ్నీ టెస్టు: తొలి రోజు ఆసీస్‌దే
సిడ్నీ: భారత్ –ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మొదటిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసేసమయానికి ఆసిస్ 166/2గా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు  ప్రారంభంలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్  డేవిడ్ వార్న‌ర్ (5) తక్కువ స్కోరుకే  మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో  ఔట‌య్యాడు. అయితే  పుకోస్కీ , ల‌బుషేన్  రెండో వికెట్‌కు  100  ప‌రుగులు జోడించడంతో ఆసీస్ కుదురుకుంది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన పుకోస్కీ రాణించాడు. హాఫ్ సెంచరీ చేపిన తర్వాత  పుకోస్కీ ఔట‌య్యాడు. డెబ్యూటంట్ న‌వ‌దీప్ సైనీ ఓపెన‌ర్ విల్‌ను పెవిలియ‌న్ పంపిన  త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన స్మిత్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ఆఖ‌రి సెష‌న్‌లో ల‌బుషేన్‌, స్మిత్ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించారు. మూడో వికెట్‌కు వీరిద్ద‌రూ 60 ప‌రుగులు జోడించారు. కుదురుకున్న జోడీని విడ‌దీసేందుకు భార‌త బౌల‌ర్లు తీవ్రంగా శ్ర‌మించినా ఫ‌లితం లేక‌పోయింది. రిష‌బ్ పంత్ పేల‌వ వికెట్ కీపింగ్‌తో విలువైన క్యాచ్‌లు జార‌విడిచాడు. రెండు  అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకున్న పుకోస్కీ హాఫ్‌ సెంచ‌రీతో విజృంభించాడు. చివ‌ర్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ బౌల‌ర్ల‌పై ఒత్తిడి పెంచుతూ మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడారు. లబుషేన్(67), స్మిత్(31), క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్,  సైనీ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు వర్షం అంతరాయం వల్ల 55 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ భారత బౌలర్లను దీటుగానే ఎదుర్కున్నారు. ✔️ Will Pucovski fifty✔️ Marnus Labuschagne fifty✔️ Just two wickets lost Australia looked ? on the first day in Sydney.#AUSvIND SCORECARD ▶️ https://t.co/Zuk24dsH1t pic.twitter.com/AFNlAnWGSo — ICC (@ICC) January 7, 2021