గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మార్చి 15న  సికింద్రాబాద్ స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకు రైలు వెళ్తుండగా  మౌలాలి స్టేషన్ సమీపంలో ఓ బోగీలో పొగలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అక్కడే రైలును నిలిపివేసి మరమ్మతు చర్యలు చేపట్టారు, అనంతరం రైలు బయలుదేరింది. దీనివలన రైలు సాయంత్రం 6:10 నుంచి 6:25 గంటల వరకు మౌలాలిలో నిలిచిపోయింది.

గత నెల 15న గోదావరి ఎక్స్‌ప్రెస్ కు  ఘోర ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే.  విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కు వస్తున్న రైలు ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని అంకుషాపూర్‌ వద్ద పట్టాలు తప్పింది. 6 కోచ్‌లు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. పట్టాలు తప్పిన బోగీలు అలాగే కాస్త దూరం ముందుకెళ్లి నిలిచిపోయాయి.  ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.