
ఓయూ, వెలుగు: ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలోని ఎస్బీఐ ఏటీఎంలో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది. ఆ విషయం తెలుసుకున్న స్టూడెంట్లు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి మనీ డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్లోకి వెళ్లాడు. కార్డు స్వైప్చేస్తున్న టైంలో లోపల పాము పడగ విప్పి ఉండడం చూసి భయపడిపోయాడు. ఒక్కసారిగా పాము.. పాము అంటూ బయటకు పరుగులు తీశాడు. గమనించిన స్టూడెంట్లు అప్రమత్తమై పామును నెమ్మదిగా బయటికి రప్పించారు. చెట్ల పొదల్లోకి వెళ్లేలా చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.