
రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ ప్రధాన ఆలయానికి ఉపాలయంగా ఉన్న.. శ్రీ లక్ష్మీనారసింహ స్వామి కొలువైన నాంపల్లి గుట్టపై మంగళవారం నడిరాత్రి నాగుపాము వచ్చింది. గుట్ట మెట్ల దగ్గర దాదాపు గంటపాటు పడగవిప్పి ఉంది. కార్తీక మాసం కావడంతో నాగుపాము గుడిదగ్గరకు వచ్చిందని భక్తులు నమ్ముతున్నారు. గుడ్డపై ఉన్న కాళీయమర్ధనం అనే చోటనే నాగుపాము వచ్చింది. కుక్కలు పామును చూసి మొరుగుతున్నా పాము అక్కడే ఉండిపోయింది. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారే కొలువయ్యారని మొక్కారు. మరికొంత మంది అక్కడే కొబ్బరికాయలు కొట్టారు. కార్తీక మాసంలో రాజన్నను దర్శించుకున్న తర్వాత.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితి.