
సౌతాఫ్రికా, టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్కు అనుకోని అతిథి విచ్చేసింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిందో లేక..ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చిందో ఏమో కానీ..గౌహతి గ్రౌండ్ లో సడెన్ గా స్నేక్ ప్రత్యక్షమైంది. అనూహ్యంగా గ్రౌండ్లోకి పాము రావడంతో..కొద్దిసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. మైదానంలో ఒక్కసారిగా పామును చూసిన ఆటగాళ్లు భయాందోళనకు గురయ్యారు. దీంతో అంపైర్లు కొద్దిసేపు ఆటను నిలిపేసారు. గ్రౌండ్ సిబ్బంది పామును బయటకు పంపించడంతో ఆట మళ్లీ మొదలైంది.
ఫన్నీ కామెంట్స్..
గౌహతి గ్రౌండ్కు పాము రావడంతో..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చిందేమో అని కొందరు కామెంట్ పెట్టారు. స్నేక్ మైదానానికి చెందినదై ఉంటుందని మరి కొందరు అన్నారు. పామును ముందే చూసారు కాబట్టి సరిపోయిందని..లేకపోతే ఎవరినైనా కరిస్తే ..పరిస్థితి దారుణంగా ఉండేదని కామెంట్ పెట్టారు. అయితే విషసర్పమా? సాధారణ పామేనా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.