ఇన్​స్టా ఆగింది!

ఇన్​స్టా ఆగింది!

ప్రపంచవ్యాప్తంగా 3 వేల ఖాతాలపై ఎఫెక్ట్ 

న్యూఢిల్లీ: సోషల్ మీడియా యాప్ ఇన్​స్టాగ్రామ్​కు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది అకౌంట్లు తాత్కాలికంగా సస్పెండ్ అయ్యాయి. కొందరివి  స్ట్రక్ అయిపోయాయి. దీంతో ఇన్​స్టాలోకి లాగిన్ కావడం సాధ్యం కావట్లేదని ట్విట్టర్​లో పోస్ట్ లు పెడుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూజర్లకు ఇన్స్​స్టాగ్రామ్ మేనేజ్​మెంట్ క్షమాపణలు చెప్పింది. సోమవారం రాత్రి దాదాపు 3 వేల మంది యూజర్లు వాళ్లవాళ్ల ఖాతాలోకి లాగిన్ కాలేకపోయినట్లు గుర్తించామని వెబ్​సైట్ డౌన్ డిటెక్టర్ వెల్లడించింది.