ఫెస్టివల్ పేరుతో 30 క్వింటాళ్ల టమాటాలు వృథా..సోషల్ మీడియాలో విమర్శలు

ఫెస్టివల్ పేరుతో 30 క్వింటాళ్ల టమాటాలు వృథా..సోషల్ మీడియాలో విమర్శలు

హైదరాబాద్: భారత్ లో మొట్టమొదటి టమోటా ఫెస్టివల్  హైదరాబాద్ లో జరిగింది.  మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా పలువురు పా ర్టిసిపేంట్స్ ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. స్పెయిన్లోని బునోల్లో ఏటా నిర్వహించబడే ఐకానిక్ లా టొమాటినా పండుగను మరి పించేలా ఈ ఫెస్టివల్ ను ఎక్స్ పీరియం పార్కులో నిర్వహించారు. 

మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన అందగత్తెలు ఉల్లాసభరిత మైన టమోటా విసరడం మరియు ఉత్సాహభరితమైన ఉత్సవాలలో ఆనందించారు. విశిష్ట అతిథులలో మిస్ ఇటలీ కోరి గోస్ట్, మిస్ జమైకా చియా ఎస్పోసిటో, మిస్ నమీబియా టాప్టే బెనెట్, మిస్జిబ్రాల్టార్ సెల్మాకామాన్యా, మిస్ శ్రీలంక షేనియా బల్లెస్టర్ తదితరులున్నారు. టమోటా టెర్రా విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వ హించిన ఉత్సవ వేదికపై పలు దేశాల అందగత్తెలు ఆనందం వ్యక్తం చేస్తూ నృత్యాలు చేశారు.

అయితే ఫెస్టివల్ పేరుతో వేల కిలోల టమోటాలను వృథా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో  నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దాదాపు 3 టన్నుల టమాటాలను ఈ ఫెస్టివల్ ఉపయోగించారు. టమాటాలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ తొక్కుకుంటూ ఎంజాయ్ చేశారు.