గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే వ్యక్తి నుంచి రూ. 55 వేల విలువ చేసే 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..  మాదాపూర్ ఏరియాలో గంజాయి అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. మాదాపూర్ ఖాన్ మెట్ లోని శ్రీకర కొలీవ్ హాస్పిటల్ లో నెట్వర్క్ ఇంజనీర్ గా పని చేసే యాపుగంటి ఫణి కిరణ్ అనే వ్యక్తి నుంచి 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

ఫణిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. విచారణలో ఫణికుమార్ ఏపీ రాష్ట్రం రావులపాలెంకు చెందినవాడని తెలిసింది. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలోని ఖానామెట్‌లోని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. గతంలో ఆదిబట్ల పీఎస్ పరిధిలో ఎన్డీపీఎస్  కేసులోఅరెస్ట్ అయ్యాడు. 

కొద్ది రోజుల క్రితం గంజాయి సరఫరా చేసే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కు చెందిన నాగు అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి దానిని చిన్న పౌచ్‌లుగా మార్చి  అవసరమైన వ్యక్తులకు విక్రయించడకం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతని పై పోలీసులు నిఘా పెట్టగా గంజాయితో రెడ్ హ్యాడెడ్ గా పట్టుకున్నారు.