మాదాపూర్లో వాటర్ ట్యాంకర్ ఢీకొని..సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి

మాదాపూర్లో వాటర్ ట్యాంకర్ ఢీకొని..సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి

అతివేగం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. బుధవారం (మే 7) మాదాపూర్ లో వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

సిటీ పరిధిలోని మల్లంపేటకు చెందిన దీపక్(28) హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా దీపక్..మాదాపూర్ పర్వత్ నగర్ నుంచి హైటెక్ సిటీవైపు బైక్ వెళ్తుండగా అయ్యప్ప సొసైటీ సమీపంలో వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. 100ఫీట్ రోడ్డు దగ్గర టర్నింగ్ తీసుకుంటుండగా వాటర్ ట్యాంకర్ దీపక్ బైక్ ను వేగంగా ఢీకొట్టింది. దీంతో దీపక్ కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

►ALSO READ | హైదరాబాద్ మధురానగర్లో దారుణం.. భర్త కళ్లెదుటే భార్యకు వేధింపులు