సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కిడ్నాప్..సుఖాంతం

 సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కిడ్నాప్..సుఖాంతం

హైదరాబాద్ రాయదుర్గంలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కిడ్నాప్ సుఖాంతం అయ్యింది. కిడ్నాప్ అయిన బాధితుడి భార్యకు దుండగులు ఇంటర్నెట్ నుంచి ఫోన్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆమె రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది. కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలించారు. నాలుగు బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్ల కోసం వేట సాగించారు. సురేందర్ బాబు కిడ్నాప్ కు ఆర్థిక వివాదాలే కారణమని పోలీసులు గుర్తించి చేదించారు. 

 గుర్రం సురేందర్ ను కనుగొని తన భార్యతో ఫోన్ లో మాట్లాడించారు. నిందితులను రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, గుర్రం సురేందర్ ని రాయదుర్గం పీఎస్ పరిధిలోని లుంబినీ పార్క్ పెట్రోల్ బంక్ ముందు దుండుగులు కారులో వచ్చి కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగులను చేదించినట్టు సమాచారం