సూట్ కేసులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతదేహం

సూట్ కేసులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతదేహం

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లావణ్య హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. లావణ్యను హత్య చేసి సూట్‌కేస్‌ బ్యాగులో ప్యాక్‌ చేసి.. కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలోని కృషి స్కూల్ పక్కన కాలువలో పడేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజులు క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయిన లావణ్య.. ఇలా శవమై తేలడం సంచలనంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్సీపురం పోలీసులు…కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.