ఇంజినీర్స్ కాల్ చేయొద్దు.. పెళ్లి యాడ్ లో షరతు

ఇంజినీర్స్ కాల్ చేయొద్దు.. పెళ్లి యాడ్ లో షరతు

పెళ్లికి సంబంధించిన యాడ్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ‘కండీషన్స్ అప్లై’ అంటూ వింత వింత షరతులను వధూవరుల తరఫు వాళ్లు పెడుతున్నారు. కొన్ని అర్హతలు, గుణాలు ఉన్నవారు మాత్రమే కావాలని తేల్చి చెబుతున్నారు. తాజాగా ఓ పత్రికలో పబ్లిష్ అయిన పెళ్లి యాడ్ ను చూస్తే ఆ విషయం అర్ధమైపోతుంది. ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్స్ అయితే మాకొద్దు. దయచేసి ఇంజినీర్స్ మాకు కాల్ చేయొద్దు’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మ్యాట్రిమోనియల్ యాడ్ తాజాగా పాపులర్‌ అయింది. ‘ధనిక వ్యాపార కుటుంబంలోని ఎంబీఏ పూర్తిచేసిన వధువుకు ఐఏఎస్‌/ఐపీఎస్‌, వైద్యుడు, పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త అయిన వరుడు కావాలి’ అని ఆ యాడ్ లో ఉంది. ఈ ప్రకటన చివరి వాక్యంలో.. ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కాల్‌ చేయొద్దు’ అని ప్రస్తావించారు.

అయితే ఈ యాడ్ కు సంబంధించిన క్లిప్పింగ్‌ను వ్యాపారవేత్త సమీర్‌ అరోరా ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ఐటీ భవిష్యత్తు సజావుగా కనిపించడం లేదు’ అనే వ్యాఖ్యలను దీనికి జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా దీనిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఐటీ లేకపోతే దేశ భవిష్యత్తు సరిగ్గా ఉండదు’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. ‘మేం అంత చెడ్డవాళ్లమా’ అంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.