సాఫ్ట్​ వేర్​ జాబ్స్ లేక..! బీటెక్‌‌‌‌‌‌‌‌ నుంచి బీఈడీ వైపు

సాఫ్ట్​ వేర్​ జాబ్స్ లేక..!  బీటెక్‌‌‌‌‌‌‌‌ నుంచి బీఈడీ వైపు

    సాఫ్ట్​ వేర్​ జాబ్స్ లేక  టీచర్​ జాబ్స్​ వైపు చూపు

    సొంత ఊరిలో ఎక్కువ శాలరీతో పని చేయొచ్చనే భావన

    ఈ ఏడాది బీఈడీలో చేరిన  586 మంది బీటెక్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగుమార్కెట్​లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేకపోవడంతో బీటెక్​ స్టూడెంట్లు కూడా బీఈడీ వైపు అడుగులు వేస్తున్నారు. నాలుగేండ్ల పాటు బీటెక్​ చదివినా.. సొంత ఊరికి దూరంగా ఉండే బదులు.. ఇంటి పట్టునే ఉండి ఆ మాత్రం శాలరీ వస్తే చాలనుకుని టీచర్​ జాబ్​ల మీద దృష్టి పెడుతున్నారు. రెండేండ్లుగా బీటెక్​ నుంచి బీఈడీలో చేరుతున్న స్టూడెంట్ల సంఖ్య పెరుగుతోంది.

సొంత ఊరిలో జాబ్​కే ప్రయారిటీ

రాష్ట్రంలో ఏటా 80 వేల మంది వరకూ బీటెక్​ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన వారికి ఒకప్పుడు మంచి డిమాండ్​ఉన్నా, ఇప్పుడు హవా తగ్గడంతో, ఉద్యోగ అవకాశాలూ తగ్గిపోయాయి. కొన్ని కాలేజీల్లో క్యాంపస్​సెలక్షన్స్ తో ​కొందరు మెరిట్ స్టూడెంట్స్ కు జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి. మొత్తంగా చూస్తే బీటెక్ పూర్తి చేసి బయటకొచ్చిన వారిలో సగం మందే ఏదో ఓ కంపెనీలో జాబ్​చేస్తుండగా, మిగిలిన సగం మంది జాబ్స్ రాక అవస్థలు పడుతున్నారు. బీటెక్​ చేసిన కొందరికి టీచర్​ జాబ్ చేసేందుకు ఇష్టమున్నా, ఆ జాబ్‌‌‌‌‌‌‌‌కు బీఈడీ కోర్సుతో పాటు టెట్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరి. దీంతో వారు బీఈడీలో చేరేందుకు చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

వెయ్యికిపైగా ఎడ్​సెట్​కు..

గతేడాది బీటెక్​ చేసిన వెయ్యి మంది వరకూ ఎడ్​సెట్ కు హాజరైనా, 200 మంది బీఈడీలో చేరినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది బీటెక్​చేసిన 1,210 మంది ఎడ్​సెట్​కు అప్లై చేస్తే 586 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. ఈ విద్యాసంవత్సరం బీఈడీ మ్యాథమెటిక్స్​లో మొత్తం 3,242 మంది చేరితే వారిలో బీటెక్​ నుంచి వచ్చిన వారే 444 మంది. ఫిజికల్​సైన్స్​లో 1,421 మంది చేరితే వారిలో బీటెక్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన వారు142 మంది. ఈ లెక్కన ఆయా కోర్సుల్లో పదిశాతానికిపైగానే బీటెక్​పూర్తి చేసిన వారే.

టీచర్ జాబ్‌‌‌‌‌‌‌‌ కోసమే

గతేడాది బీటెక్​ పూర్తయింది. చాలా తిరిగినా అనుకున్న జీతానికి జాబ్​దొరకలేదు. హైదరాబాద్​ వెళ్లి జాబ్​ చేసే కంటే ఉన్న ఊరిలోనే అంతే జీతంతో జాబ్​చేయాలని నిర్ణయించుకున్నా. ఓ స్కూల్​లో మ్యాథ్స్​ ట్యూషన్​ చెప్తున్నా. టీచర్ కావాలంటే బీఈడీ, టెట్​ అవసరం. అందుకే చేస్తున్న. ఇద్దరు ఫ్రెండ్స్​ కూడా బీఈడీ చేస్తున్నరు.

– ప్రణయ్, నిజామాబాద్

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి